మిల్కీ బ్యూటీ ‘‘తమన్నా’’ మేకప్ సీక్రేట్

Durga
 మేకప్ విషయంలో అందరూ కూడా ‘తమన్నా‘ ది బెస్టు’ అని అంటున్నారు. మరి తమన్నా చెప్పే మేకప్ సీక్రేట్స్ ఏమిటో తెలసుకుందాం. మిగితా సీజన్లో ఎలా ఉన్నా చలికాలంలో మేకప్ విషయంలో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. ఎందుకంటే అటు ఎండకి మేకప్ కరిగిపోదు. ఇటూ వర్షానికి మేకప్ చెరిగిపోదు. చలికాలంలో పింక్ కలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తే భాగుంటుంది. బేబీ పింక్, లైట్ పింక్, ఇలా గులాబీ రంగులో ఎన్నో రకాల షేడ్స్ లభిస్తాయి. వాటితో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. బేబీ పింక్ రంగులో ఉండే గోళ్ళ రంగు వేసుకుని చూడండి.  ఎంతో అందంగా ఉందని మీరే ఒప్పుకుంటారు. బాగా తెల్లగా ఉండేవారు పెదవులకు రోజ్ పింక్ లిప్ స్టిక్ వేసుకుని చూడండి ఫెయిర్ గా ఉండేవారికి ఈ రంగు లిప్ స్టిక్ బాగా నప్పుతుంది. కొంచెం రంగు తక్కువగా ఉన్నవారు. నల్లటి వారికి ఛెర్రీ పింక్ చక్కగా నప్పుతుంది. ఇక సెక్సీలిప్స్ కోసం మీరేం చేయాలంటే లైట్ పింక్ కలర్ లిప్ గ్లాస్ ఉపయోగించాలి. గులాబీ రంగు, గులాబీ రంగు షేడ్స్ నచ్చనివారు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఈ కోవకు చెందిన వారైతే గోల్డ్, ట్రాంజ్, మల్బరీ రంగులలో లభించే లిప్ స్టిక్ ప్రయత్నించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: